Header Banner

వేట కొడవళ్లతో దంపతుల హత్య! అదే కారణమా?

  Sun May 18, 2025 18:46        Others

భూ తగాదాలో జరిగిన ఘర్షణ తీవ్రంగా మారి దంపతుల హత్యకు దారి తీసింది. వేట కొడవళ్లతో దాడి జరిగి భార్య అక్కడికక్కడే, భర్త ఆసుపత్రిలో మృతి చెందారు.

 

దాయాదుల మధ్య కొన్నేళ్లుగా కొనసాగుతున్న భూ వివాదం ఇద్దరి హత్యకు దారి తీసింది. భూమి కోసం ఇరువర్గాలు ఘర్షణకు దిగడంతో అనంతపురం జిల్లా రాప్తాడుకు చెందిన చిగిచెర్ల ముత్యాలమ్మ(46), చిగిచెర్ల నారాయణరెడ్డి(56) దంపతులు ప్రాణాలు కోల్పోయారు. రాప్తాడుకు చెందిన చిగిచెర్ల నారాయణరెడ్డికి గంగలకుంట రెవెన్యూ సర్వే నంబర్‌ 78-3లో (పాత సర్వే నంబర్‌) 6.20 ఎకరాల భూమి ఉండేది. దీన్ని 1997లో రాప్తాడుకు చెందిన కాటమిరెడ్డి ముగ్గురు కుమార్తెలు పుల్లమ్మ, వెంకటలక్ష్మి, నాగలక్ష్మికి ఎకరం రూ.15 వేల చొప్పున విక్రయించారు. కొనుగోలుదారులు రూ.93 వేలు చెల్లించి అగ్రిమెంట్‌ చేసుకున్నారు. రిజిస్ర్టేషన్‌కు నారాయణరెడ్డి కాలయాపన చేశారు.

 

ఇది కూడా చదవండి: పెను విషాదం.. బావిలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు మృతి!

 

దీంతో భూమి కొన్నవారు కోర్టును ఆశ్రయించారు. 2012లో అనంతపురం సివిల్‌ కోర్టు వారికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ మేరకు రిజిస్ర్టేషన్‌ పూర్తైనా నారాయణరెడ్డే ఆ భూమిని సాగు చేసుకుంటున్నారు. దీంతో భూమి కొన్నవారు హైకోర్టును ఆశ్రయించారు. 2022లో హైకోర్టు కూడా వారికే అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో ఈ ఏడాది జనవరి 7న రెవెన్యూ అధికారులు కొనుగోలుదారుల పేరిట భూమిని ఆన్‌లైన్‌ చేయించారు. ఈ క్రమంలో రాప్తాడు, సమీప గ్రామాలకు చెందిన కొందరు ఆ భూమిని పుల్లమ్మ, వెంకటలక్ష్మి, నాగలక్ష్మి నుంచి ఎకరం రూ.60 లక్షల చొప్పున కొన్నట్టు అగ్రిమెంటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వారందరూ శనివారం ఉదయం పొలానికి వెళ్లి ఎక్స్‌కవేటర్‌తో పొలంలోని దానిమ్మ చెట్లను తొలగిస్తుండగా.. నారాయణరెడ్డి, ఆయన భార్య ముత్యాలమ్మ, కుమారుడు ప్రదీప్‌ కుమార్‌ రెడ్డి, బావమరిది ప్రతాప్‌ రెడ్డి అక్కడికి రావడంతో ఇరువర్గాలకు ఘర్షణ జరిగింది. వేట కొడవళ్లతో దాడి చేయడంతో ముత్యాలమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన నారాయణరెడ్డి అనంతపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రతా్‌పరెడ్డితో పాటు మరో వర్గానికి చెందిన నలుగురు గాయపడ్డారు. దాడిపై ప్రదీప్‌ కుమార్‌ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

ఇది కూడా చదవండి: విశాఖ నుండి అక్కడికి డైరెక్ట్ వందే భారత్ స్లీపర్! రూట్లు ఏంటో చూడండి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో పేదలకు పండగే.. ఈ పథకం కింద ఒక్కొక్కరికి రూ.2.50లక్షలు! దరఖాస్తు చేసుకోండి! 

 

ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రి, మేయర్ విజయలక్ష్మి.. సౌకర్యాలపై ఆరా!

 

ముంబైలో హై అలెర్ట్.. విమానాశ్రయం, తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపులు..

 

ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!

 

22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

పండగలాంటి వార్త.. విజయవాడవిశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Hunting #SonInLawMurder #CoupleMurder #PossibleReason #Truth #Justice #Violence